హైందవేతరులకు పుణ్యభూమి ఏది?
ఆసింధు సింధు పర్యంతా యస్య భారత భూమికా
పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందురితి: స్మృతః
-- వాయువ్యాన గల సింధు నది నుండి దక్షిణాన గల హిందూ మహా సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూభాగాముని ఎవరైతే తమ పితృ భూమిగా, పుణ్య భూమిగా భావిస్తారో వారందరూ హిందువులే.
బలాత్కారంగా ఒక అహైందవ మతానికి మారిన మన మహమ్మదీయ, క్రైస్తవులకు హిందువులతో పాటు ఈ భూమి జన్మభూమిగా సంక్రమించినప్పటికీ, మన భాషా, ధర్మం, ఆచారాలు, జానపద గాథలు, చరిత్ర మొదలైన సంస్కృతి సంపద కూడా సంక్రమించినప్పటికీ వారు ఈ భూమిని పుణ్యభూమిగా భావించటం లేదు. ఎందుకంటే ప్రతి హిందువులాగే వారికి భారతదేశం జన్మభూమియే అయినప్పటికీ పుణ్యభూమి కాదు గనుక.
హిందువులకు ఈ దేశము మాతృభూమి మాత్రమే కాదు, పుణ్యభూమి కూడా. ఎందుకంటే ఈ గడ్డ మీదే మన ఋషులకూ, ధర్మ సంస్థాపకులకూ వేదవిజ్ఞానం సాక్షాత్కరించింది. వైదిక ద్రష్టల నుండి దయానంద సరస్వతి వరకు, జినుడి నుండి మహావీరుడు దాకా, బుద్ధుడి నుండి నాగాసేనుడి దాకా, నానక్ నుంచి గురుగోవిందుని వరకు, ఆది శంకరుల నుండి రామకృష్ణ పరమహంస వరకు మన గురువులు, దైవ సద్రుశులు ఈ గడ్డ మీదనే పుట్టి పెరిగి నడయాడారు. కనుకనే ఇది మనకు పుణ్యభూమి. అనాది నుండి నేటి వరకు ఎందఱో మహనీయుల దివ్య స్మృతులతో అణువణువూ నిండిపోయిన పవిత్ర భూమి మనది. ఈ భూమిపై ప్రతి రాయి, ప్రతి రప్పా ఒక్కొక్క ఆత్మాహుతి కథను చెప్తుంది. ఇది ఒక పవిత్ర యజ్ఞభూమి. ఈ భూమి అంతా జ్ఞానయజ్ఞంతోనూ , ఆత్మయజ్ఞంతోనూ పునీతమైంది. అందుకే ఈ మన భారతభూమి పుణ్యభూమి.
మనదేశంలోని హైందవేతరుల పుణ్యఫలం ఎక్కడో సుదూరాన పాలస్తీనాలోనో, అరెబియాలోనో ఉంది. వారి పురాణ గాథలు, మహాత్ములు, భావాలు, నాయకులు, వీరులు ఈ గడ్డ మీద పుట్టలేదు. వారి ఆధ్యాత్మిక స్మృతులన్నీ విదెశీయమైనవే. అందుకే వారి పేర్లు దృక్పథము విదేశీయతను కనబరుస్తాయి. వారి ప్రేమ ఇక్కడ కొంత, అక్కడ కొంతగా విభజితం. వారు చెప్పిందే వారు విశ్వసిస్తుంటారు. కాబట్టి ప్రేమించటంలోనూ విధేయత చూపించటంలోనూ వారు తమ జన్మభూమి కంటే పుణ్యభూములుగా భావించే విదేశీ గడ్డలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
బౌద్ధమతం భారతదేశంలో పుట్టింది. ఎన్నో దేశాలలో వ్యాపించింది. కాని వివిధ దేశాలలోని బౌద్ధులు తమ దేశాలను జన్మభూమి గానే కాకుండా పుణ్యభూమిగా కూడా భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
ఆగ్నేయ ఆసియా దేశాల్లో (జావా, బాలి, కంబోడియా, చంపా) ప్రాంతాల్లో హిందూత్వం వ్యాపించింది. ఎన్నో హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అక్కడ ఇప్పటికీ ఉన్న కొందరు హిందువులు ఆ జాతీయులే. హిందువులే అయినప్పటికీ వారంతా తమ దేశాలను జన్మభూమిగానే ములుగానే కాకుండా పుణ్యభూమిగా కూడా ఆరాధిస్తారు.
ఆయా దేశాలలోని బౌద్ధులు, హిందువులు వారి దేశాల జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోయారు. వారి సాంస్కృతిక జీవితాన్ని వారి దేశ జాతీయ జీవితంతో మిళితం చేసుకున్నారు. వారి జాతీయ సాంస్కృతిక నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేరు. అందుకే వారి దేశాలు వారికి పుణ్యభూమి కూడా.
నేడు బంగ్లాదేశ్ లోను, పాకిస్తాన్ లోను, ఆఫ్ఘానిస్తాన్ లోను హత్యాకాండలకు, అత్యాచారాలకు బలైపోతున్న హిందువులు ఒకప్పటి అభాండ భారత పౌరులు. అందువల్ల వారు సహజంగానే భారతీయులు. అఖండ భారత సాంస్కృతిక వారసత్వం ఖండిత భారాతదేశానికి మాత్రమే సిద్ధించడం చారిత్రిక, సామాజిక వాస్తవం. ఈ మూడు దేశాలలోను శేషించిన హిందువులు అనాదిగా అక్కడే జీవిస్తున్నారు. సహస్రాబ్దుల తరబడి తమ పూర్వులు నివసించిన జన్మస్థలాన్ని, తమ స్మృతుల సమాహారంతో ముడిపడిన వారసత్వాన్ని వదులుకుని వారు ఎలా జీవించగలరు? అందుకే వారు అక్కడే ఉండిపోయారు. తాము నివసిస్తున్న దేశాలను జన్మభూమిగా, పుణ్యభూమిగా కూడా ఆరాధిస్తూ అక్కడే ఉండిపోయారు తమప నిత్యం ఎన్ని అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ.
మనదేశంలోని ముస్లింలు, క్రైస్తవులు అనాదిగా వస్తూన్న మన జాతీయ సాంస్కృతిక స్రవంతిలో మిళితం కాలేకపోయారు. అనాదియైన మన జాతీయ సమగ్రతకు విరుద్ధంగానే తమ మతాల కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. ఈ దేశంలోనే పుట్టినప్పటికీ, వాళ్ళ తాతముత్తాతలు కూడా ఈ దేశ సంతతియే అయినప్పటికీ వారు మన జాతీయ సాంస్కృతిక ఏకత పట్ల విముఖులుగానే ఉంటున్నారు. అందుకే వారు భారతదేశాన్ని జన్మభూమిగానే తప్ప పుణ్యభూమిగా భావించటంలేదు.
కాబట్టి ఈ దేశాన్ని మన ముస్లిం, క్రైస్తవ సోదరులు జన్మభూమిగానే కాకుండా పుణ్యభూమిగా కూడా ఆరాధించాలి. తద్వారా అనాదిగా వస్తూన్న మన జాతీయ సాంస్కృతిక ఏకతను బలోపేతం చేయాలి.
హైందవేతరులకు పుణ్యభూమి ఏది?
Reviewed by rajakishor
on
10:54 PM
Rating:
No comments: