యూపి: మెడికల్ కాలేజిపై MLA ఇర్ఫాన్ సోలంకి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : VHP
విశ్వ హిందూ పరిషద్ మరియు ఇండియా హెల్త్ లైన్ ఈ ఘటన పై తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక శాసన సభ్యుడు ఇర్ఫాన్ సోలంకి ని వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసాయి.
కాన్పూర్ : ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లోని మెడికల్ కళాశాల పై స్థానిక శాసన సభ్యుడు ఇర్ఫాన్ సోలంకి తన అనుచరగణం తో తేది 05/03/2014 నాడు అకారణంగా దౌర్జన్యానికి పాల్పడ్డాడు, ఈ దాడిలో పలువురు విద్యార్థులతో పాటుగా వైద్య కళాశాల అధ్యాపకులు, వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు, ఒక వైద్యుడ్ని రెండో అంతస్తు నుండి క్రింద పడేయడంతో తన వెన్ను తీవ్రంగా గాయపడి ఆటను శాశ్వత వికలాంగుడిగా మారాడు ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సంఘటన అనంతరం ఆందోళన చేస్తున్న వైద్యుల పై పోలీసులు చేయి చేసుకోవడం మరింత విచారకరం.
ఇండియా హెల్త్ లైన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు విశ్వ హిందూ పరిషద్ కార్యధ్యక్షులు మాన్య ప్రవీణ్ భాయి తొగాడియ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ' వైద్యడు ప్రతక్ష నారాయణ అవరాతరం అలాంటి వైద్యుల పై తమ రాజకీయ లబ్ది, దురుద్దేశాల కోసం దాడిచేయడం వారిని భౌతికంగా గాయపరచడం అమానవీయ చర్య, ఇర్ఫాన్ సోలంకి చేసిన ఈ దౌజన్యాన్ని విశ్వ హిందూ పరిషద్, ఇండియా హెల్త్ లైన్ తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇలాంటి ఘటనకు పాల్పడ్డ ఇర్ఫాన్ సోలంకి ని వెంటనే అరెస్టు చేయాలి, గాయపడ్డ ప్రతి ఒక్కరికి వెంటనే 7 లక్షల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నాను ' అని అన్నారు.
మూలం : హిందూ న్యూస్ నెట్వర్క్
యూపి: మెడికల్ కాలేజిపై MLA ఇర్ఫాన్ సోలంకి దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : VHP
Reviewed by JAGARANA
on
10:21 AM
Rating:
No comments: