Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఒడిసా : వి హెచ్ పి చొరవతో తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 110 కుటుంబాలు

ఒడిసా 21/02/2014 : ఒడిసా రాష్ట్రము లోని రాజ్గంగాపూర్ బ్లాక్ చుంగీమాటి గ్రామములో తేది 20/02/2014 నాడు విశ్వ కళ్యాన్ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో ' ధర్మ సంస్థాపన మహా యజ్ఞం ' నిర్వహించబడినది, ఈ కార్యక్రమంలో గతంలో ప్రలోభాలకు లోనై మతం మారిన 110 కుటుంబాలు తిరిగి తమ స్వధర్మం హిందుత్వాన్ని స్వీకరించాయి. దానితో పాటుగా ఈ గ్రామంలో శ్రీ జగన్నాథ మందిర నిర్మాణానికి సంకల్పం తీసుకోవడం జరిగింది.

ఈ పవిత్ర యజ్ఞ ప్రారంభం లో చుంగిమాటి గ్రామానికి చెందిన సుమారు 350 మంది మహిళలు పవిత్ర కలషాలతో ప్రభాత భేరి నిర్వహించి యజ్ఞ స్థలానికి చేరుకోవడం జరిగింది, తదనంతరం జరిగిన యజ్ఞ కార్యక్రమంలో 200 జంటలు పాల్గొన్నాయి, ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషద్ నాయకులు శ్రీ ధర్మనారాయణ శర్మ గారు మాట్లాడుతూ 'ఈ పవిత్ర కార్యక్రమం లో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం ఎప్పుడైతే ధర్మం సంకటంలో పడుతుందో అప్పుడు ఆ భగవంతుడు ధర్మ సంస్థాపనార్థం అవతరణం చెందుతాడు , ఈ కలియుగం ఆ భగవంతుడు మనఅందరిలో శ్రీ రాముని భక్తీ రూపంలో మన హృదయాలలో అవతరించారు,  మనం అమృత పుత్రులం, మనం పాపులం కాదు, మనం దేవతా స్వరూపులం, మనల్ని మనం పాపులం అనడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషద్ ప్రచారకులు శ్రీ విశ్వంభర్నాథ్ మిశ్ర గారు, నవీన్ చోట్రై గారు, అచ్చుతానంద్ కర్ గారు , గ్రామ పెద్దలు , తదితరులు పాల్గొన్నారు. 
ఒడిసా : వి హెచ్ పి చొరవతో తిరిగి హిందుత్వాన్ని స్వీకరించిన 110 కుటుంబాలు Reviewed by JAGARANA on 10:57 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.