Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఐఎస్‌ఐ చేయించిన హత్య! : ఆఫ్ఘన్ లో భారత సంతతి రచయిత్రి సుష్మిత ను ISI హత్య చేయించిందా ?

రచయిత : హేబ్బార్ నాగేశ్వర్ రావు 
పాకిస్తాన్ ప్రనుత్వ నిఘా విభాగం పేరుతో చెలామణి అవుతున్న జిహాదీ బీభత్స సంస్థ ఐఎస్‌ఐ సాగిస్తున్న భారత వ్యతిరేక హత్యాకాండలో ఇది భాగం.అఫ్ఘానిస్తాన్‌లోని పక్తిలా ప్రాంతంలోని ఖరానా అన్న నగరంలో నివసిస్తుండిన భారతీయ రచయిత్రి, సామాజిక ఉద్యమకారణి సుస్మితా బెనర్జీని జిహాదీ బీభత్సకారులు హత్య చేయడం ‘ఐఎస్‌ఐ’ విస్తృత పన్నాగంలో భాగం! హఫీజ్ సరుూద్ అనే బీభత్సకారుడు ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో బహిరంగ సభలలో భారత్‌ను బద్దలు కొట్టే కార్యక్రమం గురించి పదే పదే ప్రస్తావించడం కూడ ఐఎస్‌ఐ వ్యూహంలో భాగం! 2008 నవంబర్‌లో ముంబయిలో బీభత్సకాండను జరిపించిన లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్ దావా ముఠాల సంస్థాపకుడైన సయ్యద్ హఫీజ్ 2008వ సంవత్సరంలో ఇలాగే భారత్‌ను బద్దలు కొట్టే ప్రకటనలు పదే పదే చేశాడు. 2009లో కొన్నాళ్ళపాటు గృహనిర్బంధంలో ఉండిన హపీజ్ ఆ ఏడాది జూలైలో విడుదల పొందిన తరువాత మళ్ళీ భారత వ్యతిరేక ప్రకటనలు మొదలుపెట్టాడు. గత ఏడాదిగా కొంచెం మందకొడితనాన్ని అభినయించిన సరుూద్ గత జూన్‌లో పాకిస్తాన్ ముస్లింలీగ్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయినప్పటినుంచి మళ్ళీ బహిరంగ భారత వ్యతిరేక బీభత్స వ్యూహాన్ని ఆవిష్కరించడం ఆరంభించాడు. ఈ సరుూద్‌ను పట్టివ్వాలని, లేదా పాకిస్తాన్‌లో శిక్షించాలని కోరిన మన ప్రభుత్వానికి ఈ విషయమై పట్టుదల లేకపోవడంతో ఐఎస్‌ఐ ముఠావారికి మనదేశం మరింత లోకువైపోయింది. హఫీజ్ సరుూద్ ఇలా ‘్భరత్‌ను బద్దలు కొట్టే’ మాటలను వెళ్ళగక్కినప్పుడల్లా అఫ్ఘానిస్తాన్‌లోని జిహాదీ ముఠాలు కూడ ఆ దేశంలో భారత వ్యతిరేక బీభత్స కలాపాలకు పాల్పడడం 2003 నుంచీ నడుస్తున్న చరిత్ర. ఇప్పుడు భారతీయ రచయిత్రిని జిహాదీలు చంపివేయడం కూడ తమ ఘనకార్యమేనని చెప్పడానికి చాటడానికి పాకిస్తానీ ఐఎస్‌ఐ నిర్లజ్జగా యత్నిస్తుండడం మన విదేశాంగ నీతి వైఫల్యానికి నిదర్శనం. భారతీయ రచయిత్రిని తాలిబన్లు అమె ఇంటినుంచి బయటకి ఈడ్చుకొని వెళ్ళి కాల్చి చంపేసి మృతదేహాన్ని ఓ ప్రార్ధనా స్థలం వద్ద పడేసి వెళ్ళిపోయారు. కానీ ఆమెను చంపింది తాలిబన్లు కాదని హక్కానీ ముఠాకు చెందిన వారని పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్రచారం చేస్తోంది. మొదట బెనర్జీని హత్యచేసింది తాలిబన్లని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఈ ఘనకార్యంతో తమకు సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరు హక్కానీ దుండగులు అఫ్ఘానీ భద్రతా దళాలకు పట్టుబడ్డారు. హక్కానీ, అఫ్ఘానీ తాలిబన్ ముఠా, అల్ ఖాయిదా, పాకిస్తానీ తాలిబన్, లష్కర్, జమాత్ ఉద్ దావా వంటి ముఠాలన్నీ ఐఎస్‌ఐ ఆదుపాజ్ఞల్లో పనిచేస్తున్న జిహాదీ తండాలు. కానీ తాలిబన్లకు విస్తృత యంత్రాంగం, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాయి. అందువల్ల తాలిబన్లను ఐఎస్‌ఐ అనుబంధ సంస్థగా అంతర్జాతీయ సమాజం ప్రధానంగా అమెరికా ప్రభుత్వం గుర్తించడం లేదు. హక్కానీ ముఠాను నిర్మించిందీ, నియంత్రిస్తున్నదీ ఐఎస్‌ఐ అన్నది జగమెరిగిన సత్యం. 2002లో మొదలైన అమెరికా చర్యల తరువాత తాలిబన్లు, అల్‌ఖాయిదా ముష్కరులు అత్యధికులు అఫ్ఘానిస్తాన్ నుండి పలాయనం చిత్తగించారు. ఆ లోటును భర్తీ చేయడానికి పాకిస్తాన్ సైనిక దళాల విభాగమైన ఐఎస్‌ఐ హక్కానీ ముఠాను ఏర్పాటు చేసింది. దీన్ని అమెరికా అధికారికంగా గుర్తించడం అమెరికా పాకిస్తాన్‌కు మధ్య విభేదాలకు కారణమైంది. హక్కానీ ముఠా భారతీయ మహిళలను హత్యచేయడాన్ని ధ్రువపరచం ద్వారా ఐఎస్‌ఐవారు అఫ్ఘానిస్తాన్‌లో భారతీయుల ఉనికి తమకిష్టం లేదన్న వాస్తవాన్ని మరోసారి స్పష్టం చేశారు...
అమెరికా నాయకత్వంలోని నాటో దళాలు అఫ్ఘానిస్తాన్‌నుండి వచ్చే ఏడాది నిష్క్రమించనున్నాయి. ఈ నిష్క్రమణ తరువాత అఫ్ఘానిస్తాన్‌లో భారతీయ దౌత్య కార్యాలయాలపై, భారతీయ వాణిజ్య పారిశ్రామిక కార్యాలయాలపై భారతీయులపై దాడులు ముమ్మరం కాగలవని మన ప్రభుత్వం గత రెండేళ్ళుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. గతంలో అనేకసార్లు భారతీయుల అపహరణలు, హత్యలు జరిగాయి. భారతీయ రాయబార కార్యాలయాలపై మూడుసార్లు దాడులు జరిగాయి. భారత్‌తో రక్షణ సహకారం కోరుతున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్‌ఝాయ్ పాకిస్తాన్‌తో కూడ సన్నిహిత సంబంధాలను వాంఛిస్తున్నాడు. అమెరికా పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న పాకిస్తానీ సైన్యం నాటో నిష్క్రమణ తరువాత తమ దేశంతో సన్నిహితంగా మెలగుతుందన్న ఆశాభావం కర్‌ఝాయ్ వ్యక్తం చేశాడు కూడ! ఈ విధానం అఫ్ఘానిస్తాన్‌లో భారత్ ఉనికిని నిర్మూలించాలన్న పాకిస్తానీ ఐఎస్‌ఐ వ్యూహానికి పరోక్షంగా ఉపకరిస్తోంది. సుస్మిత హత్య ఈ భయాన్ని మరోసారి ధ్రువపరచింది. బెనర్జీ హత్యపట్ల అఫ్ఘానీ ప్రభుత్వం పెద్దగా ప్రతిస్పందిస్తున్న ఛాయలు కనిపించడం లేదు.
కలకత్తాకు చెందిన సుస్మితను అఫ్ఘానిస్తాన్‌కు చెందిన జాన్ బఝ ఖాన్ అనే వ్యాపారి 1986లో మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడట. ఖాన్‌కు పెళ్ళి కాలేదని విశ్వసించిన సుస్మిత అతగాడిని చేపట్టిన తరువాత మతం మార్చుకుని ఇస్లాంను స్వీకరించిందట. సయిదా ఖాన్‌గా పేరు మార్చుకున్న ఆమె భారతీయ పౌరసత్వాన్ని మాత్రం వదలుకోలేదు. భారత దేశం పట్ల జిహాదీ బీభత్స కారుల వ్యతిరేకత ఆమెను ఇప్పుడు బలిగొనింది. పెళ్ళి తరువాత అఫ్ఘానిస్తాన్‌కు వెళ్ళిన సుస్మితా బెనర్జీ తన మొగుడు అదివరకే మరో పెళ్ళి చేసుకున్నాడని ఆ భార్య కూడ అతడితో కలిసే ఉంటున్నదని తెలుసుకొని విస్మయ చకితురాలైందట. ఈ పరిస్థితులతోను, ఖాన్ వంచనతోను రాజీపడిన ఈ రచయిత్రి అతగాడి మొదటి భార్యతోను ఆమె పిల్లలతోను స్నేహాన్ని పెంచకొందట. ఆ తరువాత ఆమె మహిళా అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. మహిళల ఆరోగ్య పరిరక్షణకోసం, వైద్య చికిత్స కోసం ఆమె విశేష కృషి చేసింది. ఈ మహిళాభ్యుదయ కార్యకలాపాలే నలబయి తొమ్మిదేళ్ళ ఈ రచయిత్రికి ప్రాణహాని కలిగించడం వైపరీత్యం. మహిళల అభ్యున్నతిని వ్యతిరేకిస్తున్న జిహాదీలు ఆమెను చంపేశారు. 1994లోనే జిహాదీలు ఆమె చికిత్సాలయాన్ని ధ్వంసం చేసి ఆమెను అనేక రోజులపాటు బంధించి ఉంచారట. కానీ ఆమె సాహసవంతంగా గోడకు సొరంగం తవ్వి నిర్బంధం నుంచి, అఫ్ఘానిస్తాన్ నుండి బయటపడింది. ఆ తరువాత ఎక్కువకాలం మనదేశంలోనే గడిపిన ఈ బెంగాలీ మహిళ భద్రతా పరిస్థితలు మెరుగయ్యాయన్న భ్రమతో అఫ్ఘానిస్తాన్‌కు తిరిగి వెళ్ళింది. ప్రాణం పోగొట్టుకుంది. ఆమె తన స్వీయ చరిత్రనే ‘కాబూలీ వాలా బెంగాలీ భార్య’ అనే పేరుతో నవలను రచించారట. ఆ నవల ఆధారంగా సినిమా కూడ రూపొందిందట. ఆ నవల ‘సిఫియా’ జిహాదీలకు మరింత ఆగ్రహం కలిగించడం ఆమె హత్యకు సుదీర్ఘ నేపథ్యం...
పాకిస్తానీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ బీభత్స నిఘా విభాగం ఇలా మనదేశంలోను ఇతర దేశాలలోను భారత వ్యతిరేక కలాపాలను జరిపించడం ఆపకపోయినప్పటికీ మన ప్రభుత్వం మాత్రం ప్రతి స్పందనకు పూనుకోకపోవడం జాతీయ వైపరీత్యం. పాకిస్తాన్ ప్రభుత్వంతో తెగదెంపులకు సిద్ధ పడడం లేదు!
ఆంద్ర భూమి దిన పత్రిక సౌజన్యంతో 
ఐఎస్‌ఐ చేయించిన హత్య! : ఆఫ్ఘన్ లో భారత సంతతి రచయిత్రి సుష్మిత ను ISI హత్య చేయించిందా ? Reviewed by JAGARANA on 12:52 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.