Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు


  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విహిప నేతృత్వం లో  హిందూ సమాజం, రాష్ట్రం లోని అన్ని జిల్లాల ముఖ్య పరిపాలన కార్యాలయ ముందు ధర్నాలు 
  • 'గత 1000 సంవత్సరాలుగా యాత్ర కొనసాగుతుంది , ఎవ్వరు అడ్డుకోలేరు ' రాజ్ భవన్ ముందు ధర్నా లో మాన్య శ్రీ వై రాఘవులు
  • 'హిందూ సమాజ ధార్మిక శక్తి ముందు ప్రభుత్వ నిర్భందం తలవంచక తప్పదు' - సుధాంశు మోహన్ పట్నాయక్
  • 'అయోధ్యజి హమ్ ఆయేంగే - భవ్య మందిర్ బనాఎంగ్యే' అంటూ నినాదాలు    



విజయశ్రీ భవన్, కోటి , భాగ్యనగర్ 26/08/2013 : " అయోధ్యజి హమ్ ఆఎంగ్యే " అని నినదిస్తూ దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల నేతృత్వంలో నిర్వహించతలపెట్టిన 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌళిక మరియు రాజ్యాంగబద్ధ ప్రాథమిక హాక్కులను కాలరాస్తూ విధించిన అక్రమ నిషేదాన్ని వ్యతిరేకిస్తూ , యాత్ర ప్రారంభం సందర్భంగా ధర్మాచార్యుల పై మరియు విశ్వ హిందూ పరిషద్ నాయకులపై జరిపిన దౌర్జన్యపూరిత దాడిని , నిర్భందాన్ని వ్యతిరేకిస్తూ , మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ఇచ్చిన పిలుపులో భాగంగా హిందూ సమాజం తన శక్తి ప్రదర్శన చేసింది , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన పరిపాలన కార్యాలయాలు మరియు అన్ని సహా పరిపాలన కార్యాలయాల ముందు జరిగిన ధర్నా, నిరసన కార్యక్రమాలలో హిందూ సమాజం పెద్ద ఎత్తున పాల్గొని ' హిందూ సాధువులపై జరిగే దౌర్జన్యాన్ని సహించేది లేదు ' అని నినదించారు . రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో సుమారు 10000 మంది మంది ధర్నాలలో పాల్గొన్నారు .


రాష్ట్ర స్థాయిలో భాగ్యనగర్ లో రాజ్ భవన్ ముందు జరిగినధర్నా లో సుమారు 3500 మంది రామ భక్తులు పాల్గొన్నారు , గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ వ్తక్తిగత కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందిచడం జరిగింది. ఈ సందర్భంగా మాన్య శ్రీ వై రాఘవులు గారు ( అంతర్జాతీయ సంయుక్త  కార్యదర్శి విశ్వ హిందూ పరిషద్ ) మాట్లాడుతూ " గత 1000 సంవత్సరాలుగా ధార్మిక పరంపరలో భాగంగానే 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర నిర్వహించబడుతుంది , ఈ యాత్ర కేవలం ఈ ఏడూ మాత్రమె ఆయోజితం అయినది కాదు , కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమె ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం , ఒక వర్గానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ కర్కశంగా ఈ పరిక్రమ పై నిషేధం విధించింది , ధర్మాచార్యులను నిర్భందించింది , కనీసం భారత రాజ్యాంగం కలిపించిన మౌలిక హాక్కులను కూడా యుపి ప్రభుత్వం  నిలబెట్టలేక పోయింది , దేశ వ్యాప్తంగా ఇంత ప్రతిక్రియ వ్యక్తం అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ ధార్మిక యాత్ర పై నిషేధం ఎత్తివేయకపోతే సాదు సంతుల ధర్మాగ్రనికి గురి కాకతప్పదు" అని అన్నారు ,    
తదననతరం మాన్య శ్రీ సుధాంశు మోహన్ పట్నాయక్ ( దక్షిణ భారత సంఘటన మంత్రి ) మాట్లాడుతూ " కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించడమే లౌకికవాదం గా మారింది , వోటు బ్యాంకు రాజకియలకోసం ప్రభుత్వాలు హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాయి ఇక ఇది ఎంత మాత్రము సహన యోగ్యము కాదు , ఈ నిర్భందాలు , ధర్మాచార్యుల పట్ల అగౌరవకరమైన ప్రవర్తన ఎంతమాత్రము సమ్మతముకాదు , హిందూ సమాజం ఈ పరిణామాలను గమనిస్తూ ఉంది , కేవలం ప్రతి రోజు 150-200 మంది సాధువులు ధార్మిక మార్గంలో పాదయాత్ర చేస్తే ఘర్షణలు ఏర్పడతాయ ? దేశం లోని హిందువులు లౌకికవాదులు , సహనశీరులు కాబట్టే ఈ దేశం లో అత్యదిక ప్రాంతాలలో ఘర్షణవాతావరణం  లేదు హిందువులు అల్పసంఖ్యకులుగా ఉన్న ప్రాంతాలలోనే  ఘర్షణలు అధికంగా జరుగుతున్నాయి ఇది నిజం కాదా ? అని నేను అకిలేష్ యాదవ్ నిన్ను ప్రశ్నిస్తున్నాను " అని అన్నారు ,
ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ గోపాల్ జి ( దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి ) మాన్య శ్రీ రామ రాజు గారు ( ప్రాంత అధ్యక్షులు ) , మాన్య శ్రీ సురేందర్ రెడ్డి( ప్రాంత కార్యదక్షులు ) , మాన్య శ్రీ మాధవ్ రెడ్డి గారి గాల్ రెడ్డి ( ప్రాంత కార్యదర్శి)  , అధిక సంఖ్యలో విహిప నాయకులు , కార్యకర్తలు , రామ భక్తులు పాల్గొన్నారు .

వెల్లువెత్తిన హిందూ ప్రభంజనం : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా ధర్నాలు , నిరసనలు Reviewed by JAGARANA on 8:22 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.