"ధర్మ రక్షణలో ముందుంటాం" - హిందు ధర్మ సమ్మేళనం లో శ్రీ సోమలింగ శివాచార్య స్వామి
Reported By: యోగేశ్వర్ ఖాందేశ్ రాష్ట్రచేతన ప్రతినిది
ప్రసంగిస్తున్న శ్రీ సోమలింగ శివాచార్య స్వామి |
తేది 06/06/2013 నాడు సంఘ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యం లో " హిందు ధర్మ సమ్మెళనం " జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి విశేషంగా స్వామిజిలు , సామాజిక కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా శ్రీ సోమలింగ శివాచార్య స్వామి మాట్లాడుతూ క్రైశ్తవ మిషనరీలు మత మార్పిడిని ఒక వృత్తిగా స్వీకరించి అనేక తాయిలాలను చూపిస్తూ , ఆర్ధిక , సామాజిక స్థితి ని ఆసరాగా చేసుకొని మన ధర్మం పై దాడి చేస్తున్నాయి , ఇలాంటి సమయంలో వారి ఆగడాలను నిలువరించడానికి తమ మఠ సంస్థానం కేంద్రంగా అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయబోతున్నామని , శైవమైన , వైష్ణవమైన , వీరశైవమైన , శాక్తేయమైన , గానాపత్యమైన , బుద్ధమైన , జైనమైన హిందు ప్రధాన జీవన స్రవంతిలో అంతర్భారాగం , అస్పృశ్యత వీటికి విఘాతం కల్పిస్తుంది దానిని రూపుమాపాలని , ఈ దిశగా ధర్మాచార్యులు కేవలం జ్ఞ్యాన భోధలకే పరిమితం కాకుండా ధర్మ రక్షణకై అవసరం అయితే శస్త్ర దారులమై ముందుంటామని అన్నారు .

ప్రధాన వక్త శ్రీ వాసు గారు ( రా.స్వ.సం ఇందూర్ విభాగ్ ప్రచారక్ ) మార్గదర్శనం చేస్తూ గ్రామీణ ప్రజలు క్రైస్తవ మిషనరిల పట్ల అప్రమత్తం గా ఉండాలని మన దేశం మన ధర్మం మన సంసృతి పట్ల పిల్లలలో అవగాహన కల్పించాలని మత మార్పిడ్లకు గురై మన నుండి దూరంగా జరిగిన మన సోదరులను తిరిగి తమ తల్లి వోడికి చేరుకునే అవకాశం ఉందని అలాంటి వారిని పరివర్తన కార్యక్రమాల ద్వారా తిరిగి హిందుత్వంలోనికి ఆహ్వనించాలని పిలుపు నిచ్చారు .
ప్రసంగిస్తున్న శ్రీ వాసు గారు |
ఈ కార్యక్రమం రాజు పటేల్, శేష రావు, HM TV గంగాధర్ ల ఆద్వార్యంలో నిర్వహించబడినది ,
"ధర్మ రక్షణలో ముందుంటాం" - హిందు ధర్మ సమ్మేళనం లో శ్రీ సోమలింగ శివాచార్య స్వామి
Reviewed by JAGARANA
on
10:26 AM
Rating:
Post Comment
No comments: