Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నాది అన్నది ఏది లేదు - ఉన్నదంతా నీదే నీదే - ఇదం నమమ భారతాంభా

Download
!! పల్లవి !!
నాది అన్నది ఏది లేదు - ఉన్నదంతా నీదే నీదే - ఇదం నమమ భారతాంభా !!2!!

!! చరణం !! 
వైరి గుండెల చీల్చి చెండిన వీర పుత్రుల బడసినావు 
ధ్యాగ ధనమున తరవులయ్యిన ఋషుల మునులను పెంచినావు 
వారి ఆశయ పథమునెంచి - వారి వారసులయ్యి నిలిచి  (2)
పుణ్య ఫలమున నీదు పుత్రుడా - నా పుణ్య ఫలమున నీదు పుత్రుడా 
చేరినాను చరణములకడ
!! ఇదం నమమ !!
సూర్య గమనము యముని మనమును మార్చివేసిరి పుణ్య సతులు 
ఉగ్గు పాలన కార్యసిద్ధిని రంగరించిరి మాతృమూర్తులు 
వారి తనువు అనువు నేనై - వారి వైభవ కీర్తి పథమై (2) 
ఎన్ని జన్మలకైనా గాని - నీదు పాదము విడువ జనని 
!! ఇదం నమమ !!
మోక్షమును కాంక్షించబోను స్వార్థ చింతల పాలుకాను 
జడమైన బ్రతుకున జీవింతాంతము రాతినైతే ఏమి ఫలము 
నీదు పాదము కందకుండగా నిమిషాన వాడిన సుమమే చాలు 
కోట్ల బిడ్డల కల్పవల్లి - కోరి అర్పించేదను తల్లి 
!! ఇదం నమమ !! 

    

నాది అన్నది ఏది లేదు - ఉన్నదంతా నీదే నీదే - ఇదం నమమ భారతాంభా Reviewed by JAGARANA on 10:32 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.