Top Ad unit 728 × 90

మధ్యప్రదేశ్ లో సూర్య నమస్కారాలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ

 భోపాల్, జనవరి 11: వేలాది మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించడానికి ఓ వైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు ముస్లిం మత పెద్దలు దీన్ని విగ్రహారాధనతో పోలుస్తూ, ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు ఎవరూ పాల్గొనరాదంటూ ఫత్వా జారీ చేసారు. గురువారం నాడు వీలయినంత ఎక్కువ మంది విద్యార్థులు మూకుమ్మడి సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొనేలా చూడడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఈ కార్యక్రమం నమోదయ్యేలా చూడడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నమోదు అయ్యేలా చూడడం కోసం వీలయినంత ఎక్కువ మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చూడాలని రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలన్నిటికీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంథ్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. సూర్య నమస్కారం అనేది వ్యక్తి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఒక యోగా ప్రక్రియ అని, ఇందులో పాల్గొనే ఆసక్తి లేని వారు దీనికి దూరంగా ఉండవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అర్చనా చిట్నీస్ తెలిపారు. సూర్యుడు హిందువులకు కానీ, ముస్లింలకు కానీ చెందిన వాడు కాడని కూడా ఆమె అన్నారు. అయితే ముస్లిం మత పెద్దలు మాత్రం సూర్య నమస్కారాలను విగ్రహారాధనతో సమానమైనదని అంటూ, ఇస్లాం మత సంప్రదాయాలకు వ్యతిరేకమైన ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు ఎవరు కూడా పాల్గొనరాదని అంటూ మంగళవారం ఫత్వా జారీ చేసారు కూడా. షహర్ కాజీ సయ్యద్ ముస్తాక్ అలీ నక్వీ సైతం ఈ ఫత్వా జారీని సమర్థించారు.
మధ్యప్రదేశ్ లో సూర్య నమస్కారాలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ Reviewed by JAGARANA on 1:30 PM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.