Top Ad unit 728 × 90

డిసెంబర్ 25,26 తేదిలలో - "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ శక్తి సంగమ శిభిరం-2011" కామారెడ్డి, ఇందూర్ జిల్లా

శ్రీ ఖర నామసంవత్సరం (1951) లో ఇందూర్ (నిజామాబాద్) నగరం లోని శ్రీ దత్తమందిరంలో అప్పటి ప్రచారక్ మాన్య శ్రీ సావరికర్ ద్వారా ఇందూర్ (నిజామాబాద్) జిల్లా లో మొట్ట మొదటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖా ప్రారంభం అయింది . ఈ సవంత్సరముతో 60 సంవత్సరాలు ( షష్టిపూర్తీ ) పూర్తైంది. ఈ సందర్భమును పురస్కరించుకొని ఇందూర్ జిల్లా వ్యాప్తంగా  కామారెడ్డి  లో  " హిందూ శక్తి సంగమం " అనే పేరుతో శక్తి ప్రదర్శన చెయ్యాలని సంకల్పించడం జరిగింది , డిసెంబర్ నెల 25,26 (ఆది , సోమ వారాలలో ) రెండు రోజుల పాటుగా జరుగుతుంది. 
మరిన్ని వివరాలకు శ్రీ వాసు  (ఇందూర్ విభాగ్ ప్రచారక్ ) 9441885737 గారిని సంప్రదించాలి.

వర్గ గీత్
Click Here to Download Varga Geet

ఏదిరా నీ గాండీవం ఏది టంకారం
ఏది నీ రణ తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం

చంద్రగుప్తుని రూపు దిద్దిన చాణుక్యుని చతురతేది
జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది
ఏది నీ ధీ పటిమ ప్రజ్ఞా జ్ఞాన సౌరభము || 2 ||       || ఏదిరా ||

గ్రీకు హుణుల పీక నులిమిన భీకరమౌ  నీ శౌర్యమేది
శక కుషాణుల పీచ మణచిన శ్రీకరమౌ నీ ధైర్యమేది
ఏది రా నీ వీర విక్రమ ఘన పరాక్రమము  || 2 || || ఏదిరా ||

బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి
నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి
నివురు తోలగనిదేట్లు కలుగును పరమ వైభవము || 2 || || ఏదిరా ||

ఎత్తరా నీ గాండీవం ఎలుగేత్తరా నీ దేవదత్తం
డీకొనరా పాశుపతమై చీల్చరా రిపు దుష్ట వ్యూహం
విశ్వ గగనము నేగురవేయగా విజయ కేతనము  || 2 || || ఏదిరా ||
డిసెంబర్ 25,26 తేదిలలో - "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హిందూ శక్తి సంగమ శిభిరం-2011" కామారెడ్డి, ఇందూర్ జిల్లా Reviewed by JAGARANA on 3:03 PM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.