అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు పునఃప్రారంభం
అయోధ్య లో నిర్మించ తలపెట్టిన రామాలయ నమూనా |
సుమారు నాలుగేళ్ల అనంతరం అయోధ్యలో ప్రతిపాదిత రామాలయ నిర్మాణం కోసం
పనులు మళ్లీ మొదలయ్యాయి. రామజన్మభూమి న్యాస్ చైర్మన్ మహంత్ నృత్య
గోపాల్‌దాస్, వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యదర్శి దినేశ్ చంద్ర శనివారం ఆలయ
వర్క్‌షాప్‌లో వాటిని లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ నిర్మాణం 1990 నుంచి
2007 దాకా నిరాటంకంగా కొనసాగిందని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ
చెప్పారు. 65 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తయిందన్నారు. సోమనాథ్ తరహాలో
ఆయోధ్యలో రామాలయ నిర్మాణానికి పార్లమెంటు తీర్మానం చేయాలని నృత్య
గోపాల్‌దాస్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు పునఃప్రారంభం
Reviewed by JAGARANA
on
11:06 AM
Rating:
No comments: