Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఇప్పుడు ‘హుజీ’.. - డిల్లి పేలుళ్ళ నేపత్యం లో విశ్లేషనాత్మక వ్యాసం

జిహాదీ బీభత్సకారులు విశ్రమించలేదనడానికి ఇది మరో నిదర్శనం. ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలోనే బాంబులు పేల్చి హత్యాకాండకు పాల్పడడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకారులు తమ ‘తెగువ’ను మరోసారి ప్రదర్శించారు. మనదేశంలోని సామాన్య ప్రజల మీద మాత్రమే కాక భద్రతా వలయాల మధ్య సురక్షితంగా ఉండే ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలపై కూడ తాము దాడులు జరపగలమని హంతకులు చాటుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వద్ద పేలిన బాంబుల ప్రభావం ఫలితంగా హతులైన వారి సంఖ్య పదుల సంఖ్య దాటి వందల సంఖ్యకు చేరకపోవడం కేవలం క్షతగాత్రుల అదృష్టం. క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండడం బీభత్స తీవ్రతకు సాక్ష్యం. జన సమ్మర్దం ఉన్న ప్రాంతంలో బాంబులు పేల్చడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందిని హత్య చేయడమన్న విష వ్యూహంలో భాగంగానే బీభత్సకారులు ఈ దాడికి తెగబడ్డారన్నది స్పష్టం! ఎర్రకోటవద్ద , 2000వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన, సైనికులపైన దాడులు జరిపి ముగ్గురు జవానులను వధించడంతో మొదలైం ది ! మన భద్రతా కుడ్యంలోని కన్నాలు మన నిఘా విభాగం వారికి కనిపించడంలేదనడానికి ఆ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. మన ‘నిఘా విభాగాల’ కళ్లు మసకబారే విధంగా ప్రభుత్వాల నిర్వాహకులైన రాజకీయవేత్తలు గంతలు కట్టేశారు! మసకబారిన వీక్షణాలు సైతం అప్పుడప్పుడు బీభత్సం జాడను పసికట్టి నిరోధిస్తుండడం నిఘా విభాగం వారి నైతిక నిష్ఠకు, కార్యపటిమకు దర్పణం. రాజకీయవేత్తల అవరోధాలను దాటి విధులను నిర్వర్తించడం మాటలుకాదుమరి! కానీ కీలకమైన స్థలాలలోను, సమయాలలోను నిఘా వైఫల్యం చెందుతూనే ఉంది. బుధవారం ఢిల్లీ హైకోర్టు వద్ద మరోసారి విఫలమైంది. నిఘా విభాగాలు పసికట్టలేకపోయినప్పటికీ భద్రతా వలయాలలోని పగుళ్లు బీభత్సకారులకు మాత్రం స్పష్టంగా కన్పిస్తున్నాయన్నది నడుస్తున్న చరిత్ర నిరూపించిన నిజం. అందుకే వారు ఈ కన్నాలద్వారా సురక్షితంగా చొరబడిపోగలుగుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఉన్న దేశంలోని పార్లమెంటు భవనం ప్రాంగణంలోకి 2001 డిసెంబర్ 13వ తేదీన టెర్రరిస్టులు చొరబడి పోగలిగారు! ఎర్రకోట ముట్టడి ద్వారా మన ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగం-ఎగ్జిక్యుటివ్-్భద్రతను , పార్లమెంటు భవన ప్రాంగణంలో బీభత్స ప్రకంపనలు సృష్టించడం ద్వారా మన ‘శాసన నిర్మాణ శాఖ’ భద్రతను భంగపరచగలిగిన జిహాదీలు ఇప్పుడు హైకోర్టుపై గురిపెట్టి మన న్యాయ వ్యవస్థకు చెందిన సంస్థలకు సైతం భద్రత లేదని ఋజువు చేశారు! జమ్ముకాశ్మీర్‌లోనో, ఈశాన్య రాష్ట్రాలలోనో, అటవీ ప్రాంతాలలోనో సైనికుల మీద, పోలీసుల మీద దొంగచాటుగా విరుచుకుని పడడం వేరు! కానీ రాజధాని నగరంలోకి చొరబడిపోయి ప్రధాన రాజ్యాంగ కేంద్రాలపై ఇలా దాడులు చేయగలగడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ-వారి ఉచ్చులు నానాటికీ బిగుసుకుంటున్నాయన్న సత్యానికి తిరుగులేని ప్రమాణం!
దర్యాప్తు చేయనవసరం లేకుండానే ‘హుజీ’ ముఠావారు ఇది తమ ఘాతుకమేనని ప్రకటించుకున్నారు. 2001లో పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు మరణశిక్ష రద్దు చేయాలట. తక్షణం అఫ్జల్ గురు మరణశిక్షను రద్దు చేయకపోతే మరిన్ని ఘాతుకాలకు పాల్పడనున్నారట! బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హుజీ ముఠా అయినా మనదేశంలోని ‘ముజాహిదీన్’ తండా అయినా, లష్కర్ ముష్కరుల బృందం అయినా, ‘జమాత్’ అయినా అన్నింటికీ అనుసంధాన కర్త ఐఎస్‌ఐ మాత్రమే!మన దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు మాత్రం పాకిస్తాన్‌ను పేరుపెట్టి నిందించలేదు, ‘ఆధారాలు’ లేకుండా ఆరోపించినట్టయితే ‘అమాయకుల’పై ‘అపవాదులు’ వేసినట్టు అవుతుందేమోనని మన ప్రభుత్వం అతి జాగ్రత్త పడుతున్నట్టుంది! గత జూలైలో ముంబయిలో పాకిస్తాన్ ప్రేరక హంతకులు మళ్లీ బీభత్సకాండ జరిపినపుడే ఈ అతి జాగ్రత్త విధానాన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది! 2008 నవంబర్ 26వ తేదీన దాదాపు నూట అరవై ఆరు మందిని బలి తీసుకున్న బీభత్స ఘటనను పాకిస్తాన్ హంతక ముఠాలు జరిపించిన సంగతి మన ప్రభుత్వం ప్రకటించింది. జమాత్ ఉద్ దావా, లష్కర్ ఏ తయ్యబా వంటి బీభత్స ముఠాలపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్దేశించవలసిందిగా ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించింది. ‘తయ్యబా’ను నిషేధించి, దానికి చెందిన హంతకులను, ఆ ముఠా మూలపురుషుడైన హఫీజ్ మహమ్మద్ సయాద్‌ను అరెస్టు చేయవలసిందిగా ‘సమితి’ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. తీర్మానం కూడ ఆమోదించింది. పాకిస్తాన్ ప్రభుత్వం హంతకులను పట్టి ఇవ్వలేదు, తమ దేశంలోనైనా వారిని శిక్షించలేదు. ‘జమాత్’ను నిషేధించలేదు. సరుూద్ ఇప్పటికీ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా ‘్భరత్‌ను బద్దలుకొట్టే’ కార్యక్రమం గురించి బహిరంగ సభలలో వివరిస్తున్నాడు! పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో లభించిన వైఫల్యం కారణంగా మన ప్రభుత్వం ప్రజల దృష్టిలో విశ్వసనీయతను కోల్పోయింది, అంతర్జాతీయ సమాజంలో పలచనైపోయింది. ‘‘పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్సకాండను జరిపించిన వాస్తవాన్ని మొదట గుర్తించడం ఎందుకు? ఆ తరువాత ఆ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక బలహీతను చాటుకొనడం ఎందుకు?’’, అన్న నిర్ధారణకు మన ప్రభుత్వం వచ్చేసినట్లుంది. అందువల్లనే కాబోలు జూలై నెలలో పాకిస్తాన్ మంత్రి హీనారబ్బానీ ఖర్ మన దేశానికి వచ్చిన సందర్భంగా ముంబయి బీభత్సకాండను మన ప్రభుత్వం ప్రస్తావించలేదు!
తమను అరికట్టే స్థితిలో మాత్రమే కాదు తమ దేశ ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీసే స్థితిలో కూడా భారత ప్రభుత్వం లేదన్న సంగతి పాకిస్తానీ జిహాదీ హంతక ముఠాలకు బాగా తెలిసిపోయింది. అందువల్లనే బీభత్స రక్తసిక్త చరిత్రలో మరో ఆవృత్తాన్ని ఆరంభించారు. ఈ పునరారంభం గత జూలై 13న ముంబయిలో జరిగింది. మొదలుపెట్టిన ప్రతిసారీ జిహాదీ హంతకులు కొన్ని నెలలపాటు క్రమంగా అన్ని ప్రధాన నగరాలలో వరసగా బాంబులు పేల్చడం, కాల్పులు జరపడం గత అనుభవం! ఇప్పుడు ముంబయినుంచి ఢిల్లీకి చేరుకున్న బీభత్సం ఇంకా ఏఏ నగరాలపై విరుచుకుపడనున్నదో? అలాంటి బీభత్స చరిత్ర పునరావృత్తం కాకుండా నిరోధించడానికైనా మన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారు. నిఘా సంస్థలు నిద్రలేవాలి. అయితే ఇలా మేల్కొన్న నిఘా సంస్థలకు ప్రతిబంధకాలను కల్పించే రీతిలో ప్రకటనలు చేయడం వంటి దుశ్చర్యలకు రాజకీయ వేత్తలు మళ్లీ దిగజారరన్న విశ్వాసం లేదు! తమిళ ఈలం లిబరేషన్ టైగర్ల-ఎల్‌టిటి-ముఠాకు చెందిన ముగ్గురి మరణ శిక్షనురద్దుచేయాలని కోరుతూ గత నెల 30వ తేదీన తమిళనాడు శాసనసభ తీర్మానించింది! అఫ్జల్‌గురు వంటి రక్తపిశాచాన్ని క్షమించవలసిందిగా తమ శాసనసభ తీర్మానం ఆమోదిస్తే ఏమవుతుంది? అని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లా వెంటనే ప్రశ్నించాడు. ఈ ప్రశ్న స్ఫూర్తితో అఫ్జల్ గురును క్షమించాలని రాష్టప్రతిని కోరుతూ కాశ్మీర్ శాసనసభలో ఒక స్వతంత్ర సభ్యుడు తీర్మానాన్నికూడా ప్రవేశపెట్టేశాడు! బీభత్సకారులకు మద్దతుగా రాజకీయ జీవులు ఇలా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ ఉంటే, జిహాదీ హంతకులు మరింతగా తెగబడకుండా ఎలా ఉండగలరు? మన ప్రధాని బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో ఇక్కడ దాడులు జరపాలని ‘హుజీ’ ముందుగానేనిర్ణయించుకుంది. పసికట్టడంలో మాత్రం మన ప్రభుత్వం విఫలమైంది

source 
ఇప్పుడు ‘హుజీ’.. - డిల్లి పేలుళ్ళ నేపత్యం లో విశ్లేషనాత్మక వ్యాసం Reviewed by JAGARANA on 8:37 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.