Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా - Vijaya Vipanchi



నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా
విజయ ధ్వజము గగన సీమ నేగురవేయరమ్మురా ||నవ||


శత్రుమూక దండయాత్ర చేయదోయి ప్రతి దినం
కారుమబ్బులాకసాన క్రమ్మవోయి ప్రతి క్షణం
హిమధరాధరమ్ము పిలుపునీయదోయి నిత్యము
సమయమొచ్చే సమరమొచ్చే సాహసంబు చూపరా ||నవ||


సాహసాన సంగరాన శత్రుమూక దునుమగా
కృతఘ్నులన్ శతఘ్నితోడ ప్రేల్చి కాల్చి వేయరా
పరుల పాలబడిన భూమి మరల ముక్తినొందగా
రాష్ట్ర దేహమందు నూత్న రక్తదీప్తి నింపరా ||నవ||


తరుణమందు సర్వశక్తి ధారవోయి వలెనురా
తల్లి ఋణము దీర్చువాడే తనయులందు ఘనుడురా
శీర్షమైన కోసియిచ్చు శక్తి పౌరుషంబులన్
కదనభేరి ధ్వనులతోడ ప్రళయ నృత్య మాడరా ||నవ||

నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా - Vijaya Vipanchi Reviewed by JAGARANA on 8:34 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.