భయం భయంగా ఈశాన్యం! - అనిల్ భట్
ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద ముఠాలను ఏకం చేయడానికి చైనా ప్రయత్నిస్తోందన్న వార్తలు వెలువడిన కొద్ది రోజులకే ఉగ్రవాదులు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌పై దాడి చేసారు. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఒక కిరాణా దుకాణం ముందు జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో ఇద్దరు విద్యార్థినులతో సహా అయిదుగురు చనిపోయారు. చింగ్‌మీరాంగ్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఆ ఇద్దరు చిన్నారులు బాంబు పేలినప్పుడు బడినుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. పేలుడు తీవ్రతకు వారిద్దరి శవాల్లో ఒకటి ఎగిరి కిరాణా దుకాణంలోపల పడగా. మరోటి పక్కనే ఉన్న హెయిర్ కటింగ్ సెలూన్‌లో పడింది. బాంబు తీవ్రత ఎంతగా ఉందంటే చెల్లాచెదరుగా పడిన మృతుల అవయవాల మాంసం ముద్దలు, గుర్తు పట్టలేని విధంగా ధ్వంసమై పోయిన వాహనాల శకలాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా తయారైంది. దగ్గర్లోనే ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఉంటున్న స్వయంపాలిత జిల్లా మండలి- అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్- సభ్యులను లక్ష్యంగా చేసుకుని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ నాగానిమ్ (ఇసాక్- ముయివా) ముఠా జరిపిన దాడి ఇదని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి, కేంద్ర హోమ్ మంత్రి పి. చిదంబరం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆగిపోయిన ఆరు జిల్లా మండళ్లకు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణను ప్రవేశపెట్టడానికి మణిపూర్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియను నీరుగార్చడం కోసమే ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమస్యపై ఆల్ మణిపూర్ నాగా స్టూడెంట్స్ యూనియన్ గత ఏడాది మణిపూర్‌కు ప్రధాన మార్గమైన 39వ జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దాదాపు నలభై ఏళ్ల తర్వాత మణిపూర్‌లోని తన స్వగ్రామాన్ని తుయింగలెంగ్ ముయివా సందర్శించిన సమయంలో చేపట్టిన ఈ దిగ్బంధం మూడు నెలల పాటు కొనసాగింది. సంగక్‌ఫామ్ బాంబు పేలుడును ఖండిస్తూ మణిపూర్‌లోయలోని దాదాపుఅన్ని పాఠశాలలు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాయి. టిడిమ్ రహదారిపై వేలాది మంది విద్యార్థులు ఉమ్మడి నిరసన ప్రదర్శన జరిపారు .
తాజా బాంబు దాడితో సహా ఎన్‌ఎస్‌సిఎన్‌కు సంబంధం ఉన్న హింసాత్మక ఘటనల ఏకరవు పెట్టిన ఆల్ మణిపూర్ క్లబ్స్ ఆర్గనైజేషన్ (ఎఎంయుసిఓ) వారు ఈ తిరుగుబాటు వర్గం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెతకవైఖరి అనుసరిస్తున్నాయని ఆరోపించారు.వివిధ సంఘటనలతో సంబంధం ఉన్నట్లు స్పష్టంగా తెలిసినప్పటికీ ఈ వర్గంపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడమే ఈ వర్గానికి ఆ రెండు ప్రభుత్వాల పరోక్ష మద్దతు ఉందనడానికి నిదర్శనమని ఆ సంస్థ అధ్యక్షుడు ఎటి రెహమాన్ అంటూ, మణిపూర్‌లో ఈ ముఠా కార్యకలాపాలను అదుపుచేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కేంద్రం, ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) మధ్య ఇప్పుడు కొనసాగుతున్న కాల్పుల విరమణ మణిపూర్‌కు వర్తించదని, అందువల్ల ఈ ముఠాకు చెందిన అన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలను కఠినంగా అణచివేయడమే కాకుండా రాష్ట్రంలోని దాని శిబిరాలన్నిటినీ మూసివేయించాలని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేసారు. అంతేకాదు ఈ సంస్థ ఇప్పటికీ ఉగ్రవాదం, దారి దోపిడీలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, బెదిరింపులులాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నందున కేంద్రానికి, ఈ సంస్థకు మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలకు అర్థం లేకుండా పోయిందని కూడా ఆయన అన్నారు. ఫుంగ్యార్ సబ్‌డివిజన్‌లోని లుంగ్‌ఫు గ్రామంలో ఓ జంట హత్య, ఫుంగ్యార్ ఎసి ఎమ్మెల్యే ఎస్కార్ట్ పార్టీలోని భద్రతా జవాను హత్య ఈ ముఠాకు సంబంధం ఉన్న ఇటీవలి ఘటనలుగా ఆయన పేర్కొంటూ, పల్లెల్ సమీపంలో రాష్ట్ర భద్రతా దళాలు ఆ సంస్థకు చెందిన కార్యకర్తలను పట్టుకోవడంతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని మరోసారి గుర్తు చేసారు. ముంబయిలో, మణిపూర్‌లో జరిగిన పేలుళ్లను ఒకే దృష్టితో చూడాలని రెహమాన్ స్పష్టం చేస్తూ, ఇంఫాలు పేలుడు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి హోమ్ మంత్రి మణిపూర్‌ను సందర్శించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసారు. అంతేకాదు, ఇది మణిపూర్ ప్రజల పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోందనడానికి నిదర్శనమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఎన్‌ఎస్‌సిఎన్(ఐఎం) పాల్పడిన పలు దాడులను రాష్ట్ర హోమ్ శాఖ వివరిస్తూ, ఆ సంస్థ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న దృష్ట్యా దానితో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరడం కోసం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అలోచిస్తున్నట్లు తెలిపింది. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఆర్‌కె మేఘెన్‌ను అరెస్టు చేసినప్పటినుంచి మణిపూర్‌లో ఉగ్రవాద ముఠాలు పాల్పడిన పలు హింసాత్మక ఘటనల గురించి, ఇంతకు ముందు బంగ్లాదేశ్‌లో, ఇప్పుడు బర్మాలో ఉంటున్న ఆ సంస్థ కార్యకర్తలను చైనా ఇంటెలిజన్స్ వర్గాలు దువ్వుతున్న విషయంపై పత్రికల్లో వార్తలు వచ్చాయి , కానీ ఆ ముఠాలు మరోసారి ఎక్కడ, ఎలా దాడి చేస్తాయనే విషయం మాత్రంతెలీదు.అస్సాంలో చర్చలకు అనుకూలంగా ఉన్న అరబింద రాజఖోవా నేతృత్వంలోని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా) వర్గానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం హిరేన్ గోహైన్ నేతృత్వంలోని ‘సన్మిళితో జాతీయ అభివర్తన్’(ఎస్‌ఏజె) రూపొందించిన డిమాండ్ల జాబితాను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందజేస్తున్న తరుణంలోనే చర్చలను వ్యతిరేకించే రాజ్‌ఖోవా సహచరుడు పరేశ్ బరువా మరోసారి అస్సాంను రావణ కాష్ఠంగా మండించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న శోణిత్‌పూర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ జవాన్లు కరుడుగట్టిన నాయకుడు ఋత్విక్ హజారియాను పట్టుకున్నప్పుడు దాడులకు తీవ్రవాదుల పథకం పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 27న ఉల్ఫా మృతవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భద్రతను పెంచాలని అస్సాంను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సలహాదారు హెచ్చరించిన ఒక రోజు తర్వాత ఉల్ఫాకు చెందిన 27వ బెటాలియన్ ఉప నాయకుడైన హజారికాను అరెస్టు చేయడం గమనార్హం. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్, హోమ్ కార్యదర్శి ఆర్‌కె సింగ్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఉల్ఫాకు చెందిన ఏడుగురు సభ్యులు చిదంబరంను కలిసారు.ఈ సమావేశం సందర్భంగా చేతులు మారిన డిమాండ్ల పత్రమే ఉల్ఫాతో చర్చలకు ప్రాతిపదికగా ఉంటుంది. ఈ కోర్కెల పత్రంలోని వివరాలను వెల్లడించనప్పటికీ ఇంతకు ముందే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం , రెవిన్యూ, ప్రకృతి వనరులు, ప్రణాళికా ప్రక్రియపై పెత్తనం కలిగి ఉండడానికి, సుభద్రమైన భౌగోళక పరిస్థితి, అలాగే వేగవంతమైన, సమతౌల్యమైన అభివృద్ధి జరిగేలా చూసేందుకు రాష్ట్రానికి తద్వారా రాష్ట్ర ప్రజలకు అధికారం ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలనేది ఆ కోర్కెల పత్రంలోని ప్రధాన డిమాండ్లలో ఒకటని తెలుస్తోంది.
వాస్తవానికి బంగ్లాదేశ్‌నుంచి అస్సాంలోకి అక్రమ వలసలను నిరోధించడం ప్రధాన లక్ష్యంగా ఉల్ఫా ఎదిగింది. అయితే దీనికి భిన్నంగా ఆ సంస్థ అగ్రనాయకులు దాదాపురెండు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్న సమయంలో అక్కడినుంచి అస్సాంలోకి అక్రమ వలసలు పెరగడానికి సహాయ పడ్డారు. ఖలీదా జియా ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్‌లో వేళ్లూనుకున్న పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి ఉల్ఫా ఎలా బలమైన ఆయుధంగా మారిందో నేను రాసిన ‘ అస్సాం టెర్రరిజం అండ్ ది డెమొగ్రాఫిక్ చాలెంజ్’ అనే పుస్తకం వివరంగా తెలియజేస్తుంది. బంగ్లాదేశ్‌నుంచి వలసదారులను అస్సాంలోని వివిధ ప్రాంతాలకు తరలించడం, వారికి అక్కడ స్థిరనివాసం కల్పించడం, కొత్త మదరసాలను ఏర్పాటు చేయడం, పాతవాటిపై పెత్తనం సాగించడం, అస్సాంలోని ముస్లింలను మతత త్త్వ వాదులుగా మార్చడానికి ప్రయత్నించడం, మత ఉద్రిక్తతలను రెట్టగొట్టడం, నకిలీ కరెన్సీ పంపిణీ, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భయోత్పాతాన్ని సృష్టించడం లాంటి ఐఎస్‌ఐ వ్యూహాల అమలులో ఉల్ఫా ఒక ముఖ్యమైన సాధనంగా పని చేసింది. ఉగ్రవాదులతో చర్చలు జరపడం మంచిదే. అయితే వారి వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండునంతా స్వాధీనపరుచుకున్న తర్వాత శాశ్వతంగా హింసను విడనాడుతామని వారినుంచి హామీని పొందే విధంగా అర్థవంతమైన రీతిలో ఆ చర్చలు జరగాలి.

Reviewed by JAGARANA
on
9:10 AM
Rating:
No comments: