Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కాశ్మీర్ జనాభీష్టం ఇదీ - ఎస్‌కె సిన్హా

గులాం నబీ ఫాయ్..! భారతీయ సంతతికి చెందిన అమెరికన్ జాతీయుడు. ఈమధ్య అమెరికా, భారత్, పాకిస్తాన్ పత్రికల పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. ఐఎస్‌ఐ దగ్గర లక్షల డాలర్లు తీసుకొని కాశ్మీర్ విషయంలో అమెరికా..పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించేలా లాబీయింగ్ నడపడం..! అందుకోసం ఆయన పెద్ద సదస్సులు నిర్వహించడమే కాదు..అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కూడా ప్రలోభ పెట్టేందుకు యత్నించాడు. ప్రస్తుతం ఆయన్ను అమెరికా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫాయ్ అమెరికాలో చేసే నిర్వాకమే ఇది!
అందరూ అనుకున్నట్టుగానే..పాకిస్తాన్ ఫాయ్‌ను వెనకేసుకొచ్చింది. ఒక కాశ్మీరీగా తన రాష్ట్ర సమస్యపై మాట్లాడే హక్కు ఆయనకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. మరి రెండు దశాబ్దాలుగా ఫాయ్ ఇంత తతంగం నెరపుతున్నా సిఐఎకు ఇది తెలియకుండా వుంటుందా? తప్పనిసరిగా తెలుసు!కాకపోతే పాకిస్తాన్‌ను కష్టపెట్టడం ఇష్టం లేక..చూసీ చూడనట్టు వదిలేసింది! అయితే ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తర్వాత రెండు దేశాల సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బెడిసికొట్టాయి. అంతే కాకుండా నక్కజిత్తుల నాటకాలు ప్రదర్శిస్తున్న పాక్‌పై చర్య తీసుకోవాలని కూడా అమెరికాపై ఒత్తడులు పెరుగుతూ రావడం సరేసరి. ఇన్ని కారణాల నేపథ్యంలోనే అమెరికా అధికార్లు గులాం నబీ ఫాయ్‌పై చర్య తీసుకోవాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో కొనే్నళ్ళుగా అమెరికాలో కొనసాగుతున్న ఫాయ్ వ్యవహారం భారతీయ నిఘా సంస్థలకు తెలియకుండా వుండే అవకాశం లేదు. ఇంతకాలంగా ఉన్నత స్థాయి సదస్సుల పేరుతో ఫాయ్ నిర్వహించిన కార్యకలాపాలు, చేసిన పాక్ అనుకూల ప్రచారం కూడా భారత నిఘా సంస్థలకు తెలియదంటే నమ్మసాధ్యంకాదు. అయితే మన ప్రభుత్వానికి ఒక విచిత్ర విధానం వుంది. విచ్ఛిన్న వాదులు భారత్‌కు వ్యతిరేకంగా..కల్‌కతా, ఢిల్లీ, చండీగఢ్, వాషింగ్టన్, లండన్, బ్రసెల్స్‌ల్లో ఎంత రొమ్ము విరుచుకొని మాట్లాడినా కిమ్మనదు. మరి ఆవిధంగా వుండటం వల్ల వారిని చూసి భయంతో భారత ప్రభుత్వం బుజ్జగింపులకు పాల్పడుతోందన్న తప్పుడు సంకేతాలు వెళతాయేమోనన్న పట్టింపు లేదు! మన దేశంలోని మెజారిటీ వర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తులను కూడా ఫాయ్ తన సదస్సులకు ఆహ్వానించాడు. ఆవిధంగా అమెరికా వెళ్ళిన వారికి విమానాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణ సదుపాయం, ఫైవ్ స్టార్ హోటళ్ళలో వసతి వంటి సౌకర్యాలను ఎంతో ఉదారంగా కల్పించాడు కూడా. అయితే వీరిలో చాలా మంది భారతీయ కోణాన్ని ఈ సదస్సుల్లో వినిపించినప్పటికీ, తీర్మానాల్లో వీరి అభిప్రాయాలు చోటు చేసుకోకపోవడం గమనార్హం. ఒకసారి రెండు సార్లు వెళ్ళి వచ్చినవాళ్ళను పట్టించుకోకపోయినప్పటికీ...కొందరు అదేపనిగా ఈ సదస్సులకు హాజరయ్యారు. జమ్ము నుంచి ఒక సీనియర్ జర్నలిస్టు 17 సార్లు ఫాయ్ సదస్సుకు హాజరై వచ్చి.. అదేపనిగా కాశ్మీర్‌పై భారత్ వాదనను వ్యతిరేకిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసాడు. మరి మన ప్రభుత్వమేం చేసింది? కనికరంతో అతగాడిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆవిధంగా మాటి మాటికి అమెరికా వెళ్ళి ఫాయ్ సదస్సులో పాల్గొనేవారిపై ఓ కనే్నసి వుంచాలని ప్రూడెన్స్ డిమాండ్ చేసినా ఫలితం లేదు. 1983లో సైన్యంనుంచి రాజీనామా చేసిన తర్వాత విదేశీయ ఆహ్వానాలపై నేనెలా స్పందించాననేది చెప్పడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. పాట్నా పేరును తిరిగి పాటలీపుత్రగా మార్చాలంటూ నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆశ్చర్యకరంగా మారిషస్ దీవుల్లో విపక్ష పార్టీ నేతగా వున్న పాల్ బిరింజర్ నుంచి నాకు ఆహ్వానం అందింది. మారిషస్‌లో కూడా ఏదో ఒక నగరానికి పాటలీపుత్ర అని పేరు పెట్టాలనేది ఆయన కోరిక. ఆవిధంగా చేయడం ద్వారా మారిషస్‌లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న బీహారీల్లో రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని తద్వారా ప్రయోజనం పొందాలనేది ఆయన లక్ష్యమని తెలుసుకోవడానికి నాకు పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఆ ఆహ్వానాన్ని మన్నించడానికే మనసు మొగ్గు చూపుతున్నా..మన దేశ విదేశాంగ శాఖకు ఈ విషయమై లేఖ రాసాను. అప్పటి మారిషస్ ప్రధాని అనిరుద్ధ్ జగనాథ్‌తో మనకు మంచి సంబంధాలున్నందువల్ల..విపక్ష నేత ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళడం సముచితం కాదని సమాధానం వచ్చింది. వెంటనే నేను ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాను. అదేవిధంగా 1994లో నేను అమెరికాలో పర్యటనలో వున్న సమయంలో..రాండ్ కార్పొరేషన్ నుంచి ఒక ఆహ్వానం అందింది. కాశ్మీర్‌పై భారత్ విధానంపై మట్లాడమని వారు నన్ను కోరారు. ఈ సంస్థకు యుఎస్ ప్రభుత్వం పాక్షికంగా నిధులు మంజూరు చేస్తుంటుంది. అయితే నాకు అప్పుడు ఎటువంటి అధికార పదవి లేదు. అయినప్పటికీ కాశ్మీర్ చాలా సున్నితమైన సమస్య కావడం వల్ల, సిద్ధార్ధ్ శంకర్ రాయ్ సలహా అడిగా. ఆయన అప్పట్లో అమెరికాలో భారత రాయబారిగా వున్నారు. అయితే భారత్‌కు చెందిన వ్యక్తులను వారు మొదటిసారిగా ఆహ్వానిస్తున్నందువల్ల.. మన విధానాన్ని స్పష్టంగా చెప్పడానికి వీలుంటుంది కనుక తప్పనిసరిగా వెళ్ళండి..అని ఆయన సలహా ఇచ్చారు. అందుకు రాయబార కార్యాలయం నుంచి ఏమైనా మార్గదర్శనం వుంటుందా అని కోరగా..ఆయన నవ్వుతూ...మీరు మాట్లాడేదేదో మీ పద్ధతి ప్రకారం మాట్లాడండి..అని సమాధానమిచ్చారు. దాదాపు 200 మంది యుఎస్, నాటో దేశాలకు చెందిన మేధావులు పాల్గొన్న ఆ సదస్సులో నా ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో..ఒక అమెరికన్ చాలా కిష్టమైన ప్రశ్న అడిగాడు. ‘కాశ్మీర్‌పై భారత్ వాదన ఎట్లా వున్నా..రాష్ట్రంలో హింసాకాండ చెలరేగుతోంది. అక్కడి ప్రజలు భారత్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్..మెజారిటీ ప్రజల మనోభీష్టాన్ని మన్నించాలి కదా,’ అదీ దాని సారాంశం. ‘ ఇక్కడ అంకెల గారడీ కంటే కొన్ని వౌలిక విలువలకు ప్రాధాన్యతనివ్వాలి. ఉదాహరణకు క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ బానిసత్వం వ్యక్తి స్వేచ్ఛకు విఘాతమని భావించాడు. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆయన అమెరికా సమగ్రత కోసం అంతర్యుద్ధానికి నేతృత్వం వహించాడు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మరణించిన అమెరికన్ల సంఖ్య కంటే ఈ అంతర్యుద్ధంలో మరణించిన వారి సంఖ్య చాలా అధికం. అదేవిధంగా భారతీయులమైన మేము సెక్యూలరిజాన్ని నమ్ముతాం. అందువల్ల వౌలిక సమస్యపై ఎటువంటి పరిస్థితిలోరాజీ పడబోము. కేవలం ఐదు మిలియన్ల మస్లింలకోసం దేశంలోని వంద మిలియన్ల ముస్లింల ప్రయోజనాలను పణంగా పెట్టలేం,’ అని సమాధానమిచ్చా.
అందువల్లనే బయటనుంచి వచ్చే ఆహ్వానాలను అంగీకరించే సమయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. విదేశాల గడ్డలపై విచ్ఛిన్న వాదులు భారత వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో మన జాతీయ ప్రయోజనాలను వివరించడంలో చాలా చురుగ్గా వ్యవహరించాలి. జమ్ము కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిందే. కానీ కేవలం కాశ్మీర్ లోయనే కేంద్రంగా చేసుకొని రాష్ట్ర మొత్తం ప్రయోజనాలను పణంగా పెట్టడానికి వీల్లేదు. రాష్ట్రంలోని గుజ్జార్లు, బఖెర్వాల్స్, కార్గిల్ షియాలవంటి ఇతర ముస్లిం గ్రూపులు విచ్ఛిన్న వాదులతో కలవడానికి ఇష్టపడటం లేదు. అంతే కాదు..కాశ్మీరీ ముస్లింలలో కూడా చాలా మంది విచ్ఛిన్న వాదులకు మద్దతు పలకడం లేదు. 2002లో బ్రిటన్‌కు చెందిన లార్డ్ అక్లాండ్ నేతృత్వంలో ఒక స్వచ్ఛంద సంస్థ కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 61శాతం మంది కాశ్మీరీ ప్రజలు భారత్‌లోనే వుండాలని కోరుకుంటున్నట్టు స్పష్టమైంది. కేవలం ఆరు శాతం మంది మాత్రమే పాకిస్తాన్‌తో కలవాలని భావిస్తున్నారు. 33శాతం మంత్రి మాత్రం ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇదిలావుండగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యమే లేదని, అదే భారత్ ఆధీనంలో వున్న కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పనిచేస్తున్నదంటూ.. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ నిజనిర్ధారణ కమిటి ఇచ్చిన నివేదికకు ఇయు పార్లమెంట్ 400-9 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. దీన్ని బయటకు రానీయకుండా పాక్ ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. దురదృష్ట వశాత్తు ఈ నిజాలు మనదేశంలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకనే మన ప్రభుత్వం ముందుకు కదలాల్సి వుంది.
కాశ్మీర్ జనాభీష్టం ఇదీ - ఎస్‌కె సిన్హా Reviewed by JAGARANA on 9:00 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.