సంఘ రవికిరణాలు తరుణారుణాలు హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు - Vijaya Vipanchi
సంఘ రవికిరణాలు తరుణారుణాలు
హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు
కాలమేఘము క్రమ్ము కటిక చీకటి దాటి
చిరనిద్ర వదిలించి చైతన్యమును పెంచి
హిందువుల హృదయాల హిమశిలలు కరిగించి
భరతభూమిని దివ్య భావాలు పండించు ||సంఘ||
కొండ కొనలెక్కినవి కోనలో దూకినవి
గుండె గుండెను జేరి గుబులు తీర్చినవి
ప్రజల హృదయాలలో ప్రేమభావము పంచి
నవభారతిని క్రొత్త వెలుగులను నింపినవి ||సంఘ||
విశ్వ హిందుత్వమై విద్యామహత్వమై
కార్మికుల పిడికిళ్ళ కాంతులను నింపినవి
రైతు కండలలోన కవుల గుండెలలోన
ధర్మరక్షణ దీప్తి ధరను పెంచినవి ||సంఘ||
భ్రమలలో అజ్ఞాన తిమిరమ్ము హరియించి
త్రోవ దప్పిన ఎట్టి తోటి హిందువులకై
హృదయ కమలాలలో మమత మధువులు నింపి
స్వాగతమ్మును పల్కు స్వాభిమానపు రుచులు ||సంఘ||
Powerd by Vijayavipanchi.org
సంఘ రవికిరణాలు తరుణారుణాలు హిందూ ధర్మోద్ధరణ కై తోరణాలు - Vijaya Vipanchi
Reviewed by JAGARANA
on
9:50 AM
Rating:
No comments: