Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము - Viajaya Vipanchi



వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము
మహిలోన హిందూ జాతికే ఒక దివ్య జీవన మంత్రము


ఒకనాడు భారతజాతిరా జగదేక గురువై యుండియు
తన యాత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా
ఘనవీరతా గంభీరతాయుత త్యాగభావన జ్యోతితో
గాఢాంధకారము బాపగా మన సంఘకార్యము జూపిన


మన మాతృదేశపు సేవకై ఒక నూత్న మార్గము జూపుచు
నిజ భారతాంబిక పూజకై అజరామరంబగు దీక్షతో
యువ జీవితంబులె పూలుగా ఒక సంఘమాలిక గూర్చిన
ఒక పూవుగా వెలుగొంది దేవికి పూజ సల్పిన నేతయౌ


దివినుండి గంగను దించిన భగీరధునిలో దీక్షయూ
తన ప్రాణమే త్యజియించిన దధీచిమునివరు త్యాగము
ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని శౌశీల్యంబునూ
తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ

Powerd by vijayavipanchi.org
వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము - Viajaya Vipanchi Reviewed by JAGARANA on 12:18 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.