Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

చెన్నై: RSS పదాధికారుల అక్రమ అరెస్టును నిరసిస్తూ హిందూ సంస్థల భారి నిరసన ప్రదర్శన

చెన్నై, 17/06/2014 : ప్రాంత స్థాయి సమావేశాలలో పాల్గొంటున్న 350 మందికి పైగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పధాదికారులను 700 మందికి పైగా సంఘ్ కార్యకర్తలను అకారణంగా అక్రమంగా అరెస్టులు చేసి భయోత్పత వాతావరణం కల్పించిన రామనాథపురం DCP అన్నామలై పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ హిందూ సంస్థల నాయకులు చెన్నై లో సోమవారం 16/06/2014  రోజున ఉదయం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ రాజశేకర్ మాట్లాడుతూ " రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి జాతీయవాద భావజాలం గల దేశభక్తియుత స్వచ్చంద సంస్థ పై రాష్ట్ర ప్రభుత్వం సాగించిన ధమన ఖండ దురదృష్టకరం" అని అన్నారు, వారితో పాటు విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ దురై శంకర్, ముతురమలింగం(విద్యార్థి పరిషత్) , పరమేశ్వరన్ (హిందూ మున్నాని), దురైరాజ్ ( మజ్దూర్ సంఘ్) తదితరులు మాట్లాడారు.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా దేవి పట్టణం లో తమిళనాడు ప్రభుత్వ పొలిసు దళాలు అకారణంగా భయానక పరిస్థితులు కల్పించాయి, తేది 14/06/2014 శనివారం రోజున ప్రాంత సమావేశాలలలో " నమస్తే సదా వత్సలే " అంటూ సంఘ్ ప్రార్థన జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సమావేశ స్థలం పై దాడిచేసి దాదాపు 400 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పదాదికారులను అకారణంగా అరెస్టు చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. 





Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
చెన్నై: RSS పదాధికారుల అక్రమ అరెస్టును నిరసిస్తూ హిందూ సంస్థల భారి నిరసన ప్రదర్శన Reviewed by JAGARANA on 10:56 AM Rating: 5

1 comment:

  1. Promote your Website or Blog and increase traffic to your site http://forum.telugushortfilmz.com/

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.