Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భవ్య రామ మందిర నిర్మాణమే అశోక్ జి కి సరైన నివాళి : VHP కేంద్రీయ ప్రన్యాసి, ప్రభంద్ సమితి

జబల్ పూర్, 27/12/2015 : విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ ప్రన్యాసి మరియు ప్రభంద్ సమితి సమావేశాలు తేది : 25/12/2015 నుండి 27/12/2015 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రము లోని జబల్ పూర్, అగ్రసేన్ కల్యాణ మండపం, విజయ నగర్ లో జరిగాయి, ఈ సమావేశాల్లో అమెరిక, జర్మని, ఇటాలి, బంగ్లాదేశ్ లతో పాటుగా మన దేశం నుండి సుమారు 250 మంది విహిప నాయకులు పాల్గొన్నారు, 
మాన్య శ్రీ చంపత్ రాయి పరిషద్ అంతర్జాతీయ మహా మంత్రి గారి అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాల ఉత్ఘటన కార్యక్రమంలో మాన్య శ్రీ జి రాఘవ రెడ్డి పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ ' స్వర్గీయ పూజ్య అశోక్ సింఘాల్ గారు నాకు గురుతుల్యులు, వారు తన జీవితాంతం నిరంతరం పరిషత్ ద్వారా జరుగుతున్న దైవీయ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసారు, వారు సశరీరం గా మన మధ్య లేకపోయినా, శ్రీ రామ జన్మభూమి లో భవ్య రామ మందిర నిర్మాణం కోసం వారు మన మదిలో రగిల్చిన అగ్ని రూపంలో మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటారు, ఈ ఏడు పరిషత్ కార్యవృద్ధికి పూర్తీ సమయం ఇచ్చి పనిచేయాలని, తర్వాత ఉద్యమ రూపంలో హిందూ సమాజం కదలాలి అని వారు ఆపెక్షించారు, వారి ఆశయ సాధనే మనం వారికి ఇవ్వలగలిగిన సరైన శ్రద్ధాంజలి ' అని అన్నారు       
ఈ సమావేశాలు దేశంలో పెరిగిపోతున్న జనాభా అసంతుల్యత పై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రెండు అంశాల పై తీర్మానాలు చేయడం జరిగింది,
  1. దేశంలో పెరిగిపోతున్న జనాభా అసంతుల్యత - పెను ప్రమాదంలో భారతం 
  2. సామాజిక సమరసత
       








భవ్య రామ మందిర నిర్మాణమే అశోక్ జి కి సరైన నివాళి : VHP కేంద్రీయ ప్రన్యాసి, ప్రభంద్ సమితి Reviewed by JAGARANA on 7:08 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.